పాపన్నపేట, మార్చి 29: మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం ఉదయం మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ కుటుంబ సభ్యులతో దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో వీరేశం, సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం వారికి ఘనస్వాగతం పలికారు. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు చేరుకున్నారు.

01
భక్తులు అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉన్నారు. దీంతో ఎక్కడ చూసినా భక్తుల సందడి నెలకొంది. భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు,తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో భాగంగా వేద పండితులు శంకరశర్మ, పార్థివశర్మ, రాము, నాగరాజు, రాజశేఖర్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏడుపాయల ఈవో వీరేశం,ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, బ్రహచారి, నర్సింహులు, బత్తిని రాజు, వరుణచారి, నరేశ్ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ బందోబస్తు నిర్వహించారు.