Crop | రామాయంపేట, జూన్ 19 : పంట పొలాల్లో తేమ శాతం ఉంటేనే రైతులు భూమిలో పంటలను విత్తుకోవాలని రామాయంపేట వ్యవసాయ శాఖ ఇంచార్జి ఏడీఏ రాజ్నారాయణ అన్నారు. గురువారం రామాయంపేట పట్టణ శివారులోని పంట పొలాలలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమంలో రాజ్నారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్ధితుల్లో వర్షాభావం లేనందున రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. వర్షాలు కురిసినప్పుడే పంటలు వేసుకోవాలని తెలిపారు. అనవసరంగా రైతులు తమ పంట పొలాల్లో పంటలు వేసుకుని నష్టాలకు గురి కావద్దన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు సరైన వర్షాలు పడడం లేదని అన్నారు.
వర్షాభావం ఉన్నప్పుడే పంటలను వేసుకోవాలని రాజ్నారాయణ సూచించారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలను కచ్చితంగా పాటించాలన్నారు. వ్యవసాయ శాఖ సూచనలను పాటించని రైతులు నష్టపోక తప్పదన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏఈవోలు సాయికృష్ణ, ప్రవీన్, రాజు తదితర రైతులు ఉన్నారు.
Bonakal : ‘కాంగ్రెస్ నాయకుల నుండి రక్షించండి’
GHMC | ఇదేనా స్వచ్చ సర్వేక్షన్ స్పూర్తి.. చెత్త తరలింపులో బల్డియా నిర్లక్ష్యం
Banjarahills | వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేదానికి తూట్లు.. కమిషనర్ ఆదేశాలను తుంగలో తొక్కి పనులు