నిబంధనలు పాటించాలి
సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రజలు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు.
- సిద్దిపేట సీపీ అనురాధ
సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 9: సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రజలు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు. 35వ జాతీయ భద్రత మాసోత్సవాల సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అవగాహనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులను (గోల్డెన్ అవర్) గంటలోపు దగ్గరలో ఉన్న దవాఖానకు తరలించి ప్రాణాలు కాపాడాలన్నారు.
ప్రమాదాల నివారణ గురించి 66 గ్రామాల్లో 462 మంది రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులను నియమించామన్నారు. మానవ జీవితం చాలా విలువైందని.. కార ణం లేని మరణం రోడ్డు ప్రమాదం మాత్రమే అన్నా రు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ ప్రసన్నకుమార్, ఏసీపీ సురేందర్‌రెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ చంద్రశేఖర్, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది, రోడ్డు సేఫ్టీ కమిటీ సభ్యులు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, హెచ్‌కేఆర్, ఆర్అండ్బీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

