నిఘా.. తనిఖీ.. కవాతు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలో తనఖీలు కొనసాగుతు న్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో నగదు పంపిణీతో పాటు మద్యం ఏరులైపారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ జరగకుండా ఎన్నికల కమిషన్ సూచనలతో అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టింది.
- పకడ్బందీగా అధికారుల నిఘా, తనిఖీలు
- పట్టుబడుతున్న నగదు, మద్యం
- మెదక్ జిల్లా పరిధిలోని ఏడు చెక్‌పోస్టుల్లో నిరంతర పర్యవేక్షణ
- ఇప్పటికే రూ.1821.345 లీటర్ల మద్యం
- రూ.1.69 కోట్ల నగదు పట్టివేత
మెదక్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లాలో తనఖీలు కొనసాగుతు న్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో నగదు పంపిణీతో పాటు మద్యం ఏరులైపారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ జరగకుండా ఎన్నికల కమిషన్ సూచనలతో అధికార యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. రాజకీయ పార్టీలు నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి రోజూ వాహనాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
– రూ.1.69 కోట్ల నగదు పట్టివేత…
జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో పోలీసులు విస్తృ త తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూ. 50వేలకు మించి నగదు తీసుకెళ్లొద్దని ఎన్నికల కమిషన్ నిబంధన. కొందరు తెలిసి, మరికొందరు తెలియక అంతకు మించి నగదు తీసుకెళ్తూ చెక్ పోస్టుల వద్ద తనిఖీల్లో పోలీసులకు దొరికిపోతున్నారు. మెదక్ జిల్లాలో ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నిజాంపేట, రామాయంపేట, అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొడ్మట్‌పల్లి సరిహద్దులో, నర్సాపూర్ ఎక్స్ రోడ్ వద్ద, పెద్దశంకరంపేట పోలీస్‌స్టేషన్ పరిధి జమ్మికుంట వద్ద, మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరి ధి కాళ్లకల్ వద్ద, హవేళీఘనపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి పోచమ్మరాల్ వద్ద జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయా చెక్ పోస్టుల వద్ద ఇప్పటి వర కు రూ. 1,69,37,558 నగదును పోలీసు లు స్వాధీనం చేసుకొని ఎన్నికల అధికారులకు అప్పగించారు. 1821.345 లీటర్ల మద్యాన్ని స్వా ధీనం చేసుకున్నామని, వీటి విలు వ రూ. 9,55,794 ఉంటుంది.

కేంద్ర బలగాల ఫ్లాగ్‌మార్చ్…
జిల్లాలో ఎన్నికలను ప్రశాంతం గా నిర్వహించడానికి సమస్యాత్మక ప్రాంతాల ఓటర్లలో భయాం దోళనలను తొలిగించడానికి ఎస్ఎఫ్ కేంద్ర బలగాల సేవలను వినియోగించుకోనున్నారు. ఓటర్లకు భరోసా కల్పించడా నికి జిల్లాకేంద్రంలో ఇందిరాగాంధీ స్టేడియం ధ్యాన్‌చంద్ చౌర స్తా వద్ద పారా మిలటరీ దళాల ఫ్లాగ్ మార్చ్‌ను ఎస్పీ రోహిణిప్రియదర్శిని ప్రారంభించారు. పట్టణంలోని హౌ సింగ్‌బోర్డు కాలనీ, గాంధీనగర్, సు భాష్నగర్, పెద్ద బజార్, మజీద్, న వాబ్పేట్, ఓల్డ్ బస్టాండ్, శాంతినగర్, నర్సిఖేడ్ వీధుల్లో, నర్సాపూర్ లో కేంద్ర బలగాలు, పోలీసు సిబ్బంది భారీ ప్లాగ్‌మార్చ్ నిర్వహించారు. జిల్లాకు చెందిన పోలీసులతో కలిసి కేంద్ర బలగాలు చెక్‌పోస్టుల వద్ద నిరంతరం వాహనాలను తనిఖీ చేస్తారు.
తనిఖీలకు కేంద్రబలగాలు : ఎస్పీ రోహిణిప్రియదర్శిని
జిల్లాలో నగదు, మద్యం తరలింపు అడ్డుకునేందుకు చెక్‌పో స్టుల వద్ద, నిరంతరం వాహనాల తనిఖీలు చేస్తున్నాం. మెదక్ జిల్లాకు రెండు ఎస్ఎస్పీ కంపెనీలు వచ్చాయి. వీటిని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు కేటాయించాం. కేంద్ర బలగాల తో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించి ఓటర్లకు భరోసా కల్పిస్తున్నం. నామినేషన్ వరకు కేంద్ర బలగాలు ఉంటాయి.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

