రేషన్ కార్డుల రద్దుకు కుట్ర
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటువేస్తే రేషన్ కార్డులను రద్దు చేసి, ప్రజా సంక్షేమ పథకాలను ఆపేస్తారని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ అభ్య ర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం కూచన్‌పల్లి, ముత్తాయికోట, మద్దుల్వాయిలో ప్రచారం చేశారు.
- ప్రచారంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి
మెదక్ అర్బన్, ఏప్రిల్ 30: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటువేస్తే రేషన్ కార్డులను రద్దు చేసి, ప్రజా సంక్షేమ పథకాలను ఆపేస్తారని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం కూచన్‌పల్లి, ముత్తాయికోట, మద్దుల్వాయిలో ప్రచారం చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల రేషన్ కార్డులను రద్దు చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయ భూములు, ఇల్లు, కారు ఉన్నాయనే నెపంతో రేషన్ కార్డుల రద్దుకు కుట్ర పన్నుతున్నారన్నా రు. నాలుగు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభు త్వం వృద్ధులకు రెండు నెలల పింఛన్ ఎగవేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల కోసం ఉంచిన రూ. 7000 కోట్లను కాంట్రాక్టర్లకు పంచిపెట్టి కమిషనర్ పేరిట ప్రభుత్వ పెద్దలు లబ్ధి పొందారని దుయ్యబట్టారు. ఇలాంటి వారికి ఓటు వేస్తే రాబోయే కాలంలో ప్రజలు మరిన్ని కష్టాల పాలయ్యే అవకాశం ఉందన్నారు. నిత్యం ప్రజల సంక్షేమం కోసం, రైతుల కోసం పాటుపడే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఎమ్మెల్సీ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రూ.100 కోట్లతో పేదల సంక్షేమం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు సుభాష్‌రెడ్డి తెలిపారు. కారు గుర్తుకు ఓటువేసి మన బతుకులను మనమే బాగు చేసుకుందామని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. ప్రచారంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బట్టి జగపతి, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు మాణిక్యరెడ్డి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

