హత్నూర, జనవరి 24: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల గ్రామానికి చెందిన పలువురు యువకులు శుక్రవారం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నూతనంగా ఓటుహక్కు పొందిన యువకులు కేసీఆర్‌పై అభిమానం, బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలు నచ్చడంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో ప్రతిఒక్కరికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు.
అన్నివిధాలుగా కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువకులు పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. చేరిన వారిలో శ్రీహరి, లక్ష్మీనారాయణ, అభిలాష్, రామకృష్ణ, అభిషేక్, బాలకృష్ణ, రమేశ్, ప్రశాంత్, ప్రసాద్, సుధాకర్, నితిన్ ఉన్నారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రారెడ్డి, శ్రీకాంత్, జుట్టు నర్సింహులు, శివ, నర్సింగరావు పాల్గొన్నారు.
పెద్దశంకరంపేట, జనవరి 24: మండలంలోని సం గారెడ్డిపేటకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సంగారెడ్డిపేట కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు చాకలి ఆశయ్య, 50మంది కార్యకర్తలు చేరారు. కార్యక్రమంలో జం గం శ్రీనివాస్, రమేశ్, శంకర్‌గౌడ్, రవీందర్, మానిక్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కొనం అంజయ్య ఉన్నారు.