జహీరాబాద్, జూలై 4: రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు పిలుపునిచ్చారు. జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ మొగుడంపల్లి మండల అధ్యక్షుడు సంజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో విట్టునాయక్ తండాకు చెందిన కాంగ్రెస్ నాయకులు శక్రుచౌహాన్, రాజు చౌహాన్, చౌహాన్ లక్ష్మణ్, ప్రకాశ్చౌహాన్, తారాసింగ్ రాథోడ్, గోపాల్ చౌహాన్ తదితరులు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు వారికి పార్టీ కండువా వేసి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు, గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలనపై స్వల్ప కాలంలోనే ప్రజా వ్యతిరేకత ఏర్పడిందన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ కలిసికట్టుగా ఉండి స్థానిక ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తంజీం, మోహీజొద్దీన్, గోరేమియా, గోపాల్, కేశుసింగ్రాథోడ్, చందుజాదవ్, శంకర్, కిషన్, రాజు, జితేందర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.