మద్దూరు(ధూళిమిట్ట), ఏప్రిల్ 16: ధూళిమిట్ట మండలంలోని తోర్నాలలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు తుషాలపురం బాలయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేసి పదిమంది కార్యకర్తలతో కలిసి బుధవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరిన తుషాలపురం బాలయ్యకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన తుషాలపురం బాలయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ విధానాలతో పాటు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అవలంబిస్తున్న వైఖరి నచ్చక కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. కార్యక్రమంలో ధూళిమిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి, మాజీ ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, మద్దూరు మండల అధ్యక్షుడు మేక సంతోష్ కుమార్, మాజీ వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి రాజమ్మ, మాజీ ఎంపీటీసీ ఆకుల యాదగిరి, నాయకులు తాళ్లపల్లి భిక్షపతి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు గోనెపల్లి మల్లేశం పాల్గొన్నారు.