దుబ్బాక,తొగుట,సెప్టెంబర్ 3: రైతు బాంధవుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కొనియాడారు. దుబ్బాక నియోజకవర్గాన్ని మల్లన్నసాగర్ప్రాజెక్టుతో సస్యశ్యామలంగా మార్చిన ఘనత గులాబీ అధినేత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం తుక్కాపూర్‌లో మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ , మాజీ మంత్రి హరీశ్‌రావు చిత్రపటానికి ఆయన బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జలాభిషేకం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న బురదరాజకీయాల్లో భాగంగా సీబీఐ విచారణకు ఆదేశించారని, ఇందుకు నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిరసన తెలిపారు. జై తెలంగాణ , జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన కేసీఆర్‌పై కాంగ్రెస్ కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని నిరాధారణ ఆరోపణలు చేయడం సమ ంజసం కాదన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ఖర్చు జరిగిందో, వాటి వివరాలపై కనీస అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడటం విడ్డూరం గా ఉందన్నారు. కాళేశ్వరంతో సాగు నీరందించి రైతుల కన్నీళ్లు తుడిచిన అపార భగీరథుడు కేసీఆర్ అని కొనియడారు. ఎడారిగా ఉన్నా దుబ్బాకలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించి, లక్షలాది ఎకరాలను గోదావరిజలాలతో సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
నాలుగేండ్లుగా మల్లన్నసాగర్ ద్వారా నియోజకవర్గంలోని రైతులు రెండు పంటలు పుష్కలంగా పండించుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రాజెక్టు నిర్మాణమనేది కలలో కూడా ఊహించలేదని , ఇది రైతుల పాలిట జలప్రదాయినిగా మారిందన్నారు. ఇందుకు కేసీఆర్‌ని దేవుడిగా నియోజకవర్గ రైతులు కొలుస్తున్నారన్నారు. కాంగ్రెస్ కాళేశ్వరాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తుందని దుయ్యబట్టారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించి స్వార్థరాజకీయాలతో కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని విమర్శించారు.
కేవలం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బురద రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కేసీఆర్‌కు ఉందన్నారు. 14 ఏండ్ల తెలంగాణ పో రాటంలో కేసీఆర్ ఎన్నో నిర్బంధాలు, అక్రమ కేసులు, జైలు జీవితాలు అనుభవించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ , బీజేపీలు కక్షపూరితంగా కేసీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారన్నారు. అక్రమ కేసుల ను ఎదుర్కొని కడిగిన ముత్యంలా కేసీఆర్ నిలబడుతారనే విశ్వాసం ఉందన్నారు.
దేశంలోనే అద్భుతమైన ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని కేసీఆర్ నిర్మిస్తే, ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వం గౌరవం తేవాల్సింది పోయి దిగజారుడు రాజకీయం చేస్తున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ నాయకుల కాంట్రాక్టు పనులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. గతంలో నిర్మించిన మిడ్ మానేరు. దేవాదుల, సింగూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను పక్కన పెట్టి కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌పై సీబీఐ విచారణకు ఆదేశించి ప్రజలను డైవర్షన్ చేస్తున్నదని మండిపడ్డారు.
నిత్యం యూరియా కోసం రైతులు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు. నీటిపారుదలశాఖ మం త్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేవంత్ చేతిలో కీలుబొమ్మగా మారాడని మండిపడ్డారు. అందుకే ఆయన ఉత్త్త మంత్రిగా మారడని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి నీరు రాలేదని మాట్లాడిన మంత్రి ఉత్తమ్‌కుమార్ ఒకసారి సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మల్లన్నసాగర్‌కు వచ్చి చూడాలని హితవుపలికారు.
కాంగ్రెస్ అవలంబిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని గుర్తుచేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టేయేనన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నా యకులు మనోహర్‌రావు, వెంకటనర్సింహారెడ్డి, రాం రెడ్డి, ఎల్లారెడ్డి, కైలాశ్, కిషన్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, సతీశ్‌రెడ్డి, రజినీకాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, రణం శ్రీనివాస్, భూంరెడ్డి, రాజు, స్వామి, శ్రీనివాస్‌రెడ్డి, రవి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హరీశ్‌రావుపై కవిత అసత్య ఆరోపణలు
దుబ్బాక,సెప్టెంబర్3: మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ కవిత అస త్య ఆరోపణలు చేయడం సరికాదని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అన్నారు. హరీశ్‌రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యా ఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఉద్యమంలో హరీశ్‌రావు ముం దుండి నడిపించారన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి కేసీఆర్‌తో కలిసి పని చేశారని, 200 1 ఏప్రిల్27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుందన్నా రు. కేసీఆర్, కేటీఆర్‌ను ఓడగొట్టడానికి హరీశ్‌రావు కుట్ర చేశారన్న ఆరోపణలు పూర్తి అవాస్తవమన్నారు. కవిత తీహార్ జైలులో ఉన్నప్పుడు పలుమార్లు ములాఖత్‌కు వెళ్లి ధైర్యం చెప్పిన హరీశ్‌రావుపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు.
కాంగ్రెస్ నాయకుల కుట్రలు
కేసీఆర్ కట్టించిన మల్లన్నసాగర్‌తో భూగర్భజలాలు వృద్ధిచెందాయి. మాకు ఇక్కడ వ్యవసాయం మంచిగా నడుస్తున్నది. మల్లన్నసాగర్ కట్టక ముందు బోరు, బావుల్లో నీళ్లు ఉండేవి కావు. అంతంత మాత్రమే వ్యవసాయం చేసే వాళ్లం. మల్లన్నసాగర్ కట్టిన తర్వాత భూగర్భ జలాలు వృద్ధిచెందాయి. ఇప్పుడు కేసీఆర్ దయవల్ల పంటలు పండించుకుంటున్నాం. కేసీఆర్‌కు పేరు రావద్దని కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారు.
– నర్మెట బుదవ్వ, ఎల్లారెడ్డిపేట గ్రామం, తొగుట మండలం, సిద్దిపేట జిల్లా
ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మరు
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్ర లు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. యూరియా అందించకుండా రైతులను అరిగోస పెడుతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు పై కుట్రలు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నాటకాలు ఆడుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుతోనే ఇక్కడ మంచిగా పంటలు పండించుకొని బాగుపడుతున్నాం.
– రాంపురం లక్ష్మి, ఎల్లారెడ్డిపేట గ్రామం, తొగుట మండలం, సిద్దిపేట జిల్లా