మద్దూరు(ధూళిమిట్ట), అక్టోబర్11: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరిన జంగిలి సిద్దయ్య, ఉప్పల నర్సయ్యతో పాటు 30మందికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తప్పక గుణపాఠం చెబుతారని అన్నారు. ఆరుగ్యారెంటీలు, అనేక హామీలిచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కారు ప్రజలను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా గులాబీ సైనికులు పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ వైస్‌ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, మాజీ సర్పంచ్‌లు సుందరగిరి స్రవంతిపరశురాములు, జంగిలి భిక్షపతి, నాయకులు జంగిలి కిష్టయ్య, మంద సుమన్, పీవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.