చిలిపిచెడ్, జూన్ 15: రాష్ట్రంలో కాంగ్రెస్, కేం ద్రంలో బీజేపీ పాలనపై విసుగు చెంది ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
ఆదివారం ఎమ్మెల్యే నివాసం లో రాందాస్గూడకు చెందిన కాంగ్రెస్ మాజీ సర్పంచ్ దశరథ్, లచ్చయ్య, బీజేపీ నాయకుడు వెంకటేశ్వర రావు బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, లక్ష్మణ్, మాజీ సర్పంచ్ యాదగిరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆహ్వానించారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.