సంగారెడ్డి డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగడంలేదని రేవంత్‌రెడ్డి ఫ్యాక్షన్ పాలన కొనసాగుతున్నదని, ఇందుకు మాజీ మంత్రి హరీశ్‌రావుపై అక్రమ కేసులు బనాయించడమే నిదర్శనమని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు నెరవేర్చడంలో ఘోరం గా విఫలమైందన్నారు. దీనిని ప్రశ్నిస్తున్న హరీశ్‌రావు గొంతునొక్కే ప్రయత్నం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
హరీశ్‌రావు వల్లనే పంట రుణమాఫీ చేయా ల్సి వచ్చిందన్న కోపంతో ముఖ్యమంత్రి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.ఇది వరకే హరీశ్‌రావుపై మూడు తప్పుడు కేసులు పెట్టారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. చక్రథర్గౌడ్పైనే ఎన్నో కేసులు ఉన్నాయని, అలాంటి వ్యక్తి ఫిర్యాదు చేస్తే కేసు నమో దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. హరీశ్‌రావు నైతిక ైైస్థ్యెర్యాన్ని దెబ్బతీసేందుకు సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసులతో హరీశ్‌రావు కమిట్మెంట్ను తగ్గించలేరన్నారు. ఎన్నికేసులు నమోదు చేసినా తెలంగాణ ప్రజల పక్షాన, రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఆయన పోరాటం చేస్తూనే ఉంటారని తెలిపారు.
అక్రమంగా బనాయించిన కేసును వెంటనే ఎత్తివేయాలని, లేదంటే రేవంత్‌కు ప్రజాకోర్టులో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. జహీరాబాద్ ఎమ్మె ల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. హరీశ్‌రావుకు పోలీసులు కొత్త కాదని, ఎన్ని కేసులు పెట్టినా ప్రజలపక్షాన పోరాటం చేస్తూనే ఉంటారని, రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉం టారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ డం చేతకాక రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత గ్రామంలో సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే అందుకు సంబంధించి రేవంత్‌రెడ్డి సోదరులపై కేసులు ఎందు కు నమోదు చేయలేదని ప్రశ్నించారు. హరీశ్‌రావుపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని లేదం టే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు హరీశ్‌రావుపై అక్రమ కేసులు బనాయించారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఫోన్‌ట్యాపింగ్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. చక్రధర్‌గౌడ్ కోర్టులో తన పిటిషన్ విత్‌డ్రా చేసుకుని తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనక కుట్రదాగి ఉందన్నారు. రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు కేసులు పెట్టారని ఆరోపించారు. పదేండ్లపాటు హరీశ్‌రావు రాష్ట్రం, ఉమ్మడి మెదక్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశారని గుర్తుచేశారు.ఇప్పుడు ప్రజల పక్షాన, రేవంత్ సర్కార్‌పై పోరాటం చేస్తుంటే జీర్ణించుకోలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు, ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న హరీశ్‌రావును రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనపై అక్రమ కేసులు పెట్టారన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని, దీనిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావుపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ హరీశ్‌రావు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటారన్నారు. రేవంత్‌రెడ్డి పెట్టే అక్రమ కేసులకు ఎవరూ భయపడరని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హరీశ్‌రావు వెన్నంటే ఉన్నారని గుర్తుచేశారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు జైపాల్‌రెడ్డి, మందుల వరలక్ష్మి, డాక్టర్ శ్రీహరి, ఆర్.వెంకటేశ్వర్లు, నాగరాజుగౌడ్, జీవీ.శ్రీనివాస్, రాజేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.