Subhash Reddy | మెట్రో రైల్ లోన్ కోసం బ్రోకర్‌కు భారీగా ముడుపులు.. కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ఫైర్
Subhash Reddy | ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రజలను మోసం చేసిందని మరొకసారి గుర్తు చేశారు. హైదరాబాద్‌లో మెట్రో రైల్ లోన్ కోసం బ్రోకర్‌కు రూ.700 కోట్లు ఇచ్చిన మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి అన్నారు.
Subhash Reddy | మెదక్ అర్బన్, జూన్ 20 : మెట్రో రైల్ లోన్ కోసం బ్రోకర్ కు పెద్ద మొత్తంలో ప్రభుత్వం ముడుపులు అందించడం హేయమైన చర్య అని, ఈ ప్రభుత్వం యూరియా యాప్‌ను వెంటనే ఎత్తివేయాలని, ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మండిపడ్డారు. మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రజలను మోసం చేసిందని మరొకసారి గుర్తు చేశారు. హైదరాబాద్‌లో మెట్రో రైల్ లోన్ కోసం బ్రోకర్‌కు రూ.700 కోట్లు ఇచ్చిన మొదటి ప్రభుత్వం అన్నారు.
పరిపాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని సుభాష్ రెడ్డి అన్నారు. వ్యవసాయదారునికి యూరియా యాప్ వల్ల కష్టాలు ఎదురవుతున్నాయని.. అది పూర్తిగా తీసేసే వరకు గ్రామాలలో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ పరిపాలనలో 7500 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చివరి గింజ వరకు కొనుగోలు చేశామని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం తీసుకుంటూనే వడ్లు లేదంటే మా వల్ల కాదు అది చెప్పడం దేనికి సంకేతమని సుభాష్ రెడ్డి ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను ప్రజలకు గుర్తు చేస్తామన్నారు. మిగిలిన వరి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతుల పట్ల నిజాయితీ చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, బట్టి జగపతి, మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, కృష్ణారెడ్డి, జుబేర్, అంజా గౌడ్, కిష్టయ్య, సాప సాయిలు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also :
NEET-UG Admit Card: నాగపూర్ అభ్యర్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ .. నీట్ అడ్మిట్ కార్డు వివాదం
ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఏడుస్తున్నాడని.. రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి
OTT Releases | ‘దృశ్యం 3’, ‘మారీచిక’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

