బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథ కాల్లో రైతుబీమా పథకం ఒకటి. మృతి చెంది న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసి ఆపన్న హస్తం అందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నీరుగారి పోతున్న ది. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు మృతిచెందితే ఆకుటుంబానికి పది రోజుల్లో బీమా సహాయం అందించేవారు. ఇప్పుడు ఐదు నెలలైనా అందని పరిస్థి తి ఉంది. ప్రభుత్వం రైతుబీమా ప్రీమియం చెల్లించని కారణంగానే పథకం నిలిచిపోయినట్లు తెలుస్తున్నది. రైతు కుటుం బాలకు సాంత్వనగా నిలిచిన రైతుబీమా పథకం, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అమలుకు నోచుకోక రైతు కుటుంబాలకు ధీమా కరువైంది. రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకున్న బాధిత కుటుంబాలకు సర్కారు సహాయం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. తమకేదన్నా జరిగితే రైతు బీమా కుటుంబాన్ని ఆదుకుం టుందని రైతుల్లో ఉన్న ధీమా కాస్త సడలిపోతున్నది.
సంగారెడ్డి, జూన్ 27(నమస్తే తెలంగాణ)/నారాయణఖేడ్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి రైతు గుండెలో భరోసా నింపిన పథకం రైతుబీమా. తానేమైనా పర్వాలేదు గుంటెడు భూమి ఉంటే చాలు తన కుటుంబం బ్రతికిపోతుందనే భావన ప్రతి రైతులోనూ ఉండేది. ఎకరాలకెకరాలు లేకపోయినా సరే, కనీసం గుంట భూమి ఉండాలని పరితపించిన సందర్భాలు ఉన్నాయి. భూములు లేని నిరుపేదలు సైతం గుంటల్లోనైనా సరే భూమి కొనుక్కొని పట్టాపాస్బుక్ను భద్రంగా దాచి పెట్టుకుని హాయిగా నిద్రపోయిన క్షణాలను అనేక మంది రైతులు ప్రస్తుతం గుర్తుచేసుకుంటారు.
రైతుబీమా పథకంతో కేసీఆర్ ప్రభుత్వం రైతులకిచ్చిన ధైర్యమిది. బతుకు దెరువు కోసం తమ ఊళ్లను వదిలి ఇతర ప్రాంతల్లో ఆరు నెలల పాటు వలస జీవితం గడిపే నారాయణఖేడ్ ప్రాంత లాంటి కష్ట జీవులకు రైతుబీమా ఎంతో ఆసరాగా నిలిచిందని చెప్పవచ్చు. ఏమాత్రం భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు రైతుబీమా పథకం ప్రవేశపెట్టిన తర్వాత పెద్ద ఎత్తున చిన్న కమతాల క్రయవిక్రయాలు జరిగినట్లు అధికారిక లెక్కలు ధ్రువీకరిస్తున్నాయంటే, రైతుబీమా ప్రభావం రైతులపై ఏమేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
అదీకాక రాష్ట్రంలోనే మూలకు విసిరేసినట్టున్న నారాయణఖేడ్ ప్రాంతంలో ఫామ్‌ల్యాండ్ వ్యాపా రం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందంటే అది రైతుబీమా ప్రభావం కాక మరేమిటి. ఏమాత్రం భూమి లేని ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, హైదరాబాద్‌లో ఉంటున్న చిరు వ్యాపారులు నారాయణఖేడ్ ప్రాంతంలో ఫామ్‌ల్యాండ్‌లో గుంటల చొప్పు న భూములు కొనుగోలు చేయాల్సిన అనివార్యతను కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది, రైతుబీమా పథకానిది. రూ.లక్షలు పెట్టి ప్లాటు కొనుక్కుంటే లేని ధీమా గుంట భూమి కలిగిన పాస్బుక్కు రావడం విశేషం.
సంగారెడ్డి జిల్లాలో రైతుబీమా క్లెయిమ్‌ల కోసం 200 మంది ఎదురుచూస్తున్నారు. ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గంలో గత ఫిబ్రవరి నుంచి మొత్తం 74 మంది రైతులు మృతి చెందగా, ఏ ఒక్కరికి రైతుబీమా పరిహారం అందలేదు. సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పదేండ్ల పాలనలో 6575 రైతు కుటుంబాలకు రూ.329 కోట్ల బీమా పరిహారం అందజేశారు.సంగారెడ్డి జిల్లాలో ఫిబ్రవరి నుంచి బీమా క్లెయిమ్‌లు నిలిచిపోయాయి. సుమారు 283 మ ంది రైతులు చనిపోవటంతో ఆయా కుటుంబాలు బీమా డబ్బులు కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వం ఎల్ఐసీకి బీమా ప్రీమియం చెల్లించకపోవటంతో ఎల్ఐసీ క్లెయిమ్‌లు నిలిపివేసింది. ఫలితంగా కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
బీమా డబ్బుల కోసం రైతు కుటుంబాలకు వ్యవసాయశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోతున్నది. రైతు కుటుంబాలు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఎల్ఐసీకి బీమా ప్రీమియం బకాయిలు చెల్లించినట్లు చెబుతున్నారు. అయినప్పటికీ జిల్లాలో ఇంకా బీమా క్లెయిమ్‌ల ప్రక్రియ పూర్తికావడంలేదు. జిల్లాలో 283 మంది రైతు కుటుంబాలు క్లెయిమ్‌ల కోసం ఎదురుచూస్తున్నాయి. కాగా, వీరిలో 83 మంది రైతు కుటుంబాల బీమా క్లెయిమ్‌లు ఆమోదం పొందినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే 83 మంది రైతుకుటుంబాలకు ఇంకా రూ.5 లక్షల బీమా పరిహారం డబ్బు లు చేతికందలేదు. రైతు బీమా క్లెయిమ్‌ల కోసం ఇంకా 200 మంది రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు.
అమీన్పూర్ మండలంలో 4, అందోల్‌లో 15, చౌటకూరు 3, గుమ్మడిదలలో 3, హత్నూరలో 12, ఝరాసంగంలో 7, జిన్నారంలో 5, కల్హేర్‌లో 5, కందిలో 4, కంగ్టిలో 9 రైతు బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. కోహీర్ మండలంలో 5, కొండాపూర్‌లో 11, మనూరులో 5, మొగుడంపల్లిలో 7, మునిపల్లిలో 4, నాగల్గిద్దలో 8, నారాయణఖేడ్‌లో 8 క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. నిజాంపేటలో 7, న్యాల్కల్లో 4, పటాన్చెరులో 5, పుల్కల్లో 11, రాయికోడ్‌లో 13, సదాశివపేటలో 15, సంగారెడ్డిలో 3, సిర్గాపూర్‌లో 3, వట్పల్లిలో 6, జహీరాబాద్‌లో 8 బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఎల్ఐసీకి బీమా ప్రీమియం డ బ్బులు చెల్లించిందని, త్వరలోనే పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లు త్వరలోనే ఆమోదం పొంది రైతుబీమా పరిహారం డబ్బులు బాధిత కుటుంబాలకు అందుతాయని సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు.
మరణించిన రైతు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రైతుబీమా పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నా. ప్రభుత్వం రైతుబీమా ప్రీమియం చెల్లించని కారణంగా ఐదు నెలలుగా రైతుబీమా రావడం లేదు. బీఆర్ఎస్ హయాంలో ఒక కుటుంబంలో ఎంత మంది రైతులు ఉన్నా వారి వయస్సును బట్టి అర్హులైన రైతులకు రైతుబీమాను వర్తింపజేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబంలో యజమానికి లేదా ఒకరికి మాత్రమే రైతుబీమా వర్తింపజేసే దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బాధిత రైతు కుటుంబాలకు అండగా నిలిచిన రైతుబీమా పథకం అమలుపై నిర్లక్ష్యం వహించడం చూస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదనే విషయాన్ని తెలియజేస్తున్నది.
-మహారెడ్డి భూపాల్‌రెడ్డి, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే
నా భర్త మారెప్ప మూడు నెలల క్రితం చనిపోయాడు. ఇప్పటి వరకు రైతుబీమా డబ్బులు రాలేదు. కేసీఆర్ గవర్నమెంట్ల అయితే చనిపోయిన పది రోజులకే డబ్బులు వచ్చా యి. ఆ డబ్బులు వస్తే మా కుటుంబానికి ఆసరా అయ్యేది. మాది నిరుపేద కుటు ంబం. ఆ పైసల కోసం మూడు నెలల నుండి ఎదురు చేస్తున్నాము. గవర్నమెంట్, ఆఫీసర్లు దయచేసి రైతుబీమా డబ్బులు వచ్చేటట్లు చూడాలని కోరుతున్నా.
-లక్ష్మి, మృతిచెందిన రైతు భార్య, నాగూర్(బి), కంగ్టి మండలం (సంగారెడ్డి జిల్లా)
నా భర్త అశోక్ మరణించి మూడు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు రైతుబీమా పైస లు రాలే. మాది చాలా బీద కుటుంబం ఉన్న కొద్దిపాటి చేనులో ఎవుసం చేసుకుని బతి కేటోళ్లం. మా భర్త పోయిన తర్వాత ఎవుసం మొత్తం కుంటుపడ్డది. గవర్నమెంట్ ఇచ్చే పైసలు వస్తే ఏదన్నా చేసి బతుకుదామని అనుకుంటున్నం. గాపైసల కోసం ఎదురు చూసుడు అయితున్నది. రైతుబీమా పైసలు ఇచ్చి ఆదుకుంటే మంచిగుంటది.
-కవిత, మృతి చెందిన రైతు భార్య, కరస్‌గుత్తి, నాగల్గిద్ద మండలం (సంగారెడ్డి జిల్లా)