వర్గల్, నవంబర్ 5: సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన దారి కంకరతేలి, గుంతలుపడి ఏండ్లు గడుస్తున్నా, పట్టించుకునే వారు కరువయ్యారు.
వానపడితే గుంతల్లో నీరు నిలుస్తున్నది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి రోడ్డుపైన వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల మరమ్మతులు విస్మరించిందని వర్గల్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.