నమస్తే తెలంగాణ, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ సిద్దిపేట జిల్లా(జూలై 12) : సిద్దిపేట జిల్లా కేంద్ర దవాఖాన సమస్యలకు నిలయంగా మారింది. రోగం నయం చేసుకోవడానికి ఈ దవాఖానకు వస్తే.. ఇక్కడ నెలకొన్న సమస్యలు, అసౌకర్యాలతో రోగులు మరింత సుస్తికి గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దవాఖాన నిర్వహణను గాలికి వదిలేయడంతో రోగులు, రోగుల సహాయకులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఎమర్జెన్సీ వార్డుకు వచ్చిన రోగుల సహాయకులు విశ్రాంతి తీసుకునేందుకు సరైన సౌకర్యాలు లేవు. దీంతో వారు ద వాఖాన కారిడార్లలో, మరికొందరు దవాఖాన బయట రోడ్డు పక్కన పడుకుంటున్నారు. గర్భిణుల కు ఉపయోగించే సానింగ్ సెంటర్, బెడ్లు చిరిగిపో యి, ఇంకా ఇతరత్రా ఇబ్బందులు ఉన్నాయి. దవాఖాన ప్రాంగణంలో కుకలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. పారిశుధ్యం పడకేసింది. ఎమర్జెన్సీ వార్డులో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయక ఉకపోతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.
