మిరుదొడ్డి, జూలై 18 : ఇందిరమ్మ రాజ్యంలో పల్లెల్లో గుంతల రోడ్లు….గుడ్డి దీపాలు ఉండేవని, సీఎం రేవంత్‌రెడ్డి మళ్లీ ఎనకటి రోజులు తీసుకువచ్చే విధంగా పాలన కొనసాగిస్తున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్‌రెడ్డి ఆరోపించారు. గుంతలమయమైన బీటీ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం చిట్టాపూర్కమాన్ నుంచి మోతె మీదుగా మిరుదొడ్డి మండలం కాసులాబాద్, మిరుదొడ్డి వరకు ఆయా గ్రామాల ప్రజలతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు.
అనంతరం తహసీల్, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నిరంకుశ పరిపాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్‌పై ఆరోపణలు చేయడమే తప్ప రాష్ట్రంలో ప్రజాపాలన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి వెనుకంజ వేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఉంటాడు కానీ ఆయన రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు.
ఎక్కడైనా ప్రభుత్వ అధికారిక సమావేశం జరిగితే అర్హత లేకున్నా ఆస్టేజీపైకి ఎక్కి కూర్చుటాడని ఎద్దేవా చేశారు. బీటీరోడ్లకు మరమ్మతులు చేయకుంటే వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పల్లెల్లో బీటీ రోడ్లకు మరమ్మతులు చేయకుంటే కాంగ్రెస్ పార్టీని సాంఘిక బహిష్కరణ చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు బాల్‌రాజు, రాములు, శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు స్వామి, బైరయ్య, బీఆర్ఎస్ నాయకులు లింగం, నాయకులు రాములు, కిష్టయ్య,, మల్లేశం, రమేశ్, ఆయా గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.