చేర్యాల, ఫిబ్రవరి 29: తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌పై కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని, సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలపై తిట్ల పురాణం బంద్ చేసి వెంటనే రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. చేర్యాల పట్టణంలో గు రువారం ఎమ్మెల్యే పల్లా విలేకరులతో మాట్లాడు తూ మేడిగడ్డపై కాంగ్రెస్ సర్కారు కుట్ర చేయడం సరికాదని, 88 పిల్లర్లలో రెండు పిల్లర్లు కుంగితే వా టిని మరమ్మతు చేయడం పక్కన పెట్టి, స్వార్థ రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వృథా అనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. మాజీ మం త్రులు కేటీఆర్, హరీశ్‌రావుల ఆధ్వర్యంలో మేడిగడ్డకు జనగామ నియోజకవర్గం నుంచి ముఖ్య నాయకులతో కలిసి వెళ్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడిగితే సీఎం హోదా మర్చిపోయి ప్రతిపక్షంపై పరుషపదజాలంతో దూషిస్తున్నారని, ఇది తగదన్నారు. బీఆర్ఎస్ పాలనలో చేర్యాల పట్టణం సమగ్రాభివృద్ధి చెందిందని, రానున్న రోజుల్లో చేర్యాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు విశ్రమించేదిలేదని, ఇప్పటికే అసెంబ్లీలో డివిజన్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించడమే కాకుండా సంబంధిత శాఖ మంత్రికి లేఖలను సైతం అందజేసినట్లు తెలిపారు. గతేడాది తాను మంజూరు చే యించిన రూ.10కోట్లను మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు కేటాయించాలని మున్సిపల్ తీర్మానించినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్, ఏఈ, కౌన్సిలర్లతో వార్డుల్లో పర్యటించి రూ.10కోట్ల నిధుల నుంచి అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపా రాణి శ్రీధర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్ పుర్మ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, నాయకులు ముస్త్యాల బాలనర్సయ్య, శివగారి అంజయ్య, యాట యాదగిరి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు, పచ్చిమడ్ల సిద్దిరాములు, చేతిరెడ్డి సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించుకునే పుట్టిన రోజు వేడుకలకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరై ఆయనతో కేకును కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చేర్యాల పట్టణంలోని ఫంక్షన్‌హాలులో జరిగిన గురువన్నపేట మాజీ ఉపసర్పంచ్ తుక్కోజు నర్సింహులు కుమారుడు కిషన్ పెండ్లికి, సిద్దిపేట పట్టణంలోని వీఎస్ఎస్ గార్డెన్స్‌లో జరిగిన మర్రిముచ్చాలకు చెందిన వ్యాపారి కూర ధనలక్ష్మీ వెంకటేశ్వర్ల ద్వితీయ కుమార్తె మానస వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.