Child Protection Acts | మెదక్ రూరల్, జూలై 05 : మెదక్ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ప్లాన్ ఇండియా, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగం సంయుక్తంగా బాలల సంరక్షణ, చట్టపరమైన అవగాహన కార్యక్రమంలో భాగంగా మొబైల్ వ్యాన్‌ను అదనపు కలెక్టర్ నగేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 6 రోజులపాటు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నామని.. ఈ కార్యక్రమం ద్వారా బాలల సంరక్షణకు సంబంధించిన చట్టాలపై రిపోర్టింగ్ అండ్ సపోర్టింగ్ మెకానిజమ్స్ గురించి అవగాహన ఇవ్వనున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి అల్లాదుర్గ్ సీడీపీఓ పద్మలత, జిల్లా చైల్డ్ హెల్ప్‌లైన్ కో ఆర్డినేటర్ గంగాధర్, ప్లాన్ ఇండియా నుండి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాహుల్, ప్రాజెక్ట్ ఆఫీసర్స్ సుజాత రాజ్, వెంకటేశ్వర్లు, సోషల్ వర్కర్స్ మంజుల , భార్గవి, రవి, విమెన్ ఎంపవర్మెంట్ హబ్ సిబ్బంది తదితరులు పాల్గొనటం జరిగినది.
రైతులకు తప్పని తిప్పలు.. మళ్లీ యూరియా కోసం కష్టాలు
RTC Special Bus | అరుణాచల గిరి ప్రదక్షిణకు దిల్సుఖ్నగర్ నుంచి ప్రత్యేక బస్సులు
Leopard | వడ్డేపల్లిలో చిరుత సంచారం.. భయాందోళనలో ప్రజలు