సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 6: పోడు పట్టా భూములు పొందిన రైతులకు సోలార్ పంపుసెట్లు అందించాలని అధికారులను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరా సౌరగిరి వికాసం పథకంపై గిరిజన సంక్షేమ శాఖ, వ్యవసాయ, అటవీ శాఖ, సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2024-25 సంవత్సరానికి 73 మంది రైతులను గుర్తించాలన్నారు. రెండున్నర ఎకరాల భూమిని ఒక గ్రూప్‌గా తీసుకొని ఆ గ్రూపులోని రైతులకు ఒక యూనిట్ లక్షల రూపాయలతో మోటర్లు, సోలార్ పంప్సెట్లు పంపిణీ చేయాలన్నారు. వ్యవసాయం, పండ్ల తోట్ల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్‌రావు పాల్గొన్నారు.