Collector Rahul Raj | రామాయంపేట, మార్చి 23 : మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలకే స్వయంగా బస్సులను కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చిన ఎడల మహిళా సంఘాలు ఆర్థిక అభివృద్ది ఎంతో దోహదం చేసిన వాళ్లమవుతామని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. ఇవాళ తెల్లవారుజామునే మెదక్ నుండి రామాయంపేటకు కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపపతులు సైకిల్‌పై బస్టాండుకు చేరుకున్నారు.
బస్టాండులో ఉన్న సమస్యలపై నేరుగా అక్కడున్న ప్రయాణికుల ద్వారానే అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్లను త్వరలోనే అత్యాధునికంగా ఆధునీకరిస్తామని తెలిపారు. బస్టాండులో ఉన్న సమస్యల సాధనకు కృషి చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రామాయంపేట బస్టాండులో ప్రయాణికులకు తాగునీటితో ఇబ్బందులు ఏమి లేవన్నారు. ఇంకా మెరుగైన సౌకర్యాల గురించి దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
అక్కడే ఉన్న ఆర్టీసీ డీఎం సురేఖతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్టాండ్లలో సమస్యలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. మెదక్ జిల్లాకు నూతనంగా బస్సులు తెప్పించేందుకు కృషి చేస్తానన్నారు. మెదక్ శాసన సభ్యుడు రోహిత్‌రావు మెదక్ నియోజకవర్గ సమస్యలను తీరుస్తున్నాడని తెలిపారు. మెదక్, రామాయంపేటలు సింపుల్ సిటీగా ఉన్నాయని.. ఆ విధంగా ప్రభుత్వం అభివృద్ది కోసం అడుగులు ముందుకు వేస్తుందన్నారు.
అనంతరం తిరుగు ప్రయాణంలో రామాయంపేటలో మెదక్ బస్సు ఎక్కిన కలెక్టర్ దంపతులు మహాలక్ష్మి పథకం విషయమై బస్సులోనే మహిళలను వివరాలడిగి తెలుసుకున్నారు. స్వయంగా ఆర్టీసీ బస్సు ఎక్కగానే మెదక్ వరకు రెండు ఆర్టీసీ బస్సు టికెట్లు తీసుకుని కలెక్టర్ తన భార్యకు టికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు