Collector Rahul Raj | మెదక్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. ఇవాళ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాసంపై అదనపు కలెక్టర్ నగేష్ కలిసి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
టెలీ కాన్ఫరెన్స్లో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఈ ప్రక్రియలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.