Collector Rahul raj | మెదక్, మే 16 (నమస్తే తెలంగాణ) : సమాజంతో భాగస్వామ్యమై డెంగ్యూ ను నివారించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఇవాళ మెదక్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్‌తో కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డెంగ్యూ గురించి అవగాహన పెంచడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తొలిసారిగా 2010 మే 16 నుండి జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప్రారంభించారని ..వర్షాకాలంలో డెంగ్యూ కేసులు ప్రజలకు ప్రభలే ఆస్కారం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.
డెంగ్యూ వ్యాధిపై జిల్లాలో ప్రజలను అప్రమత్తం చేస్తూ పరిసరాల పరిశ్రుభతపై అవగాహన కల్పించాలని తెలిపారు. డెంగ్యూ, ఇతర కీటక జనిత వ్యాధులు ప్రజలకు ప్రబలకుండా జూన్ నెల నుండి ప్రణాళికలు సిద్ధం చేసుకుని అనుగుణంగా క్ష్రేతస్థాయిలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. డెంగ్యూ లక్షణాలు ఉన్నట్టైతే మీ దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, జిల్లా ఆస్పత్రికి వెళ్ళి తగిన వైద్య పరీక్షలు చేసుకుని చికిత్స చేయించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
డెంగ్యూ జ్వరం రాకుండా ఈ జ్రాగత్తలు తీసుకోవాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలి. దోమల నివారణ కొరకు తీసుకోవలసిన జ్రాగత్తలు తీసుకోవాలన్నారు. ప్రతీ మంగళ,శుక్రవారం డ్రైడే (పొడి దినము)గా పాటించి నీటి నిలువలు అన్ని శుభ్రపరిచి, ఆరబెట్టి తిరిగి నింపుకోవాలి. దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకుందాం- డెంగ్యూని నివారిద్దాం అని అన్నారు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు విశేష కృషి చేయాలని చెప్పారు.
అనంతరం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవ వాల్ పోస్టర్స్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ఆసుప్రతి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, ఇంటర్మీడియట్ అధికారి మాధవి, డిప్యూటీ డీఎంహెచ్వోలు సృజన, జ్ఞానేశ్వర్, డిసిహెచ్వోలు డాక్టర్ శివ దయాల్ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Water tank | పాఠశాలలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్.. భయందోళనలలో విద్యార్థులు
Badibata program | నిజాంపేట మండల వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం
Huge Donation | తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త గోయాంక భారీ విరాళం