Collector Rahul raj | మెదక్ రూరల్, జూన్ 18 : హవేలీ ఘన్పూర్ మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. కలెక్టర్ పర్యటనలో భాగంగా మెదక్ ఆర్డీవో రమాదేవి, హవేలీ ఘన్పూర్ మెదక్ తాసిల్దార్లు సింధూ రేణుక, లక్ష్మణ్ కుమార్‌తో కలిసి మండలంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హవేలి ఘనపూర్ మండల కేంద్రంలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని, మద్దులవాయి గ్రామములో మరో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించడం జరిగిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ , జిల్లా ఎలక్ట్రిసిటీ స్టోర్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ తదితర నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ స్థలాలను పరిశీలించడం జరిగిందని చెప్పారు.
ఇందుకు సంబంధించి క్షుణ్ణంగా డీటెయిల్ మ్యాప్ తయారు చేయమని తాసిల్దారును ఆదేశించడం జరిగిందన్నారు. తదుపరి చర్యలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్