Collector Rahul raj | చేగుంట, అక్టోబర్ 11: పల్లె దవాఖానలో పరిశుభ్రంగా ఉండాలని, వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు, సిబ్బందికి సూచించారు. చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం తనిఖీలు నిర్వహించారు. మెదక్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అందుతున్న వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించారు.
చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పీహెచ్సీని తనిఖీ చేయడంతోపాటు అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. దవాఖానలో ఓపీ రిజిస్టర్ తనిఖీ చేశారు. రోజు ఎంత మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారని.. మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు.
గత నెలలో ఈ పల్లె దవాఖాన పరిధిలో ఎన్ని డెలివరీలు అయ్యాయి, అవి ఏ ఆసుపత్రులలో అయ్యాయో అని ఆరాతీశారు. పల్లె దవాఖానలో పరిశుభ్రంగా ఉంచుకోవడం , వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించడం లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Thungathurthy : ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు : తాటికొండ సీతయ్య
Chandur : బీఆర్ఎస్ కస్తాల గ్రామ నాయకుల ఆర్థిక సాయం
Bihar Elections | ‘మేం బతికే ఉన్నాం’.. ఎన్నికల అధికారులకు బీహార్ గ్రామస్తుల మొర
Rangareddy | 250 గజాల ఇంటి స్థలం కోసం వివాదం.. బాబాయిపై కుమారుడి కత్తి దాడి