సర్లో పూర్తి వివరాలు నమోదు చేయాలి
సర్లో పూర్తి వివరాలు నమోదు చేయాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు.గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని అచ్చంపేటలో సర్ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడం,తిరిగిసేకరించడం,వివరాలు నమోదు తదితర అంశా ల్లో జాగ్రత్త వహించాలన్నారు. ఎ
- మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశం
- మెదక్ జిల్లా నర్సాపూర్, అచ్చంపేటలో క్షేత్రస్థాయిలో పర్యటించిన కలెక్టర్
నర్సాపూర్,జూన్ 25: సర్లో పూర్తి వివరాలు నమోదు చేయాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు.గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని అచ్చంపేటలో సర్ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడం,తిరిగిసేకరించడం,వివరాలు నమోదు తదితర అంశా ల్లో జాగ్రత్త వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు.అర్హత కలిగిన పౌరుడు ఓటరు జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచించారు. పేరు, సవరణలు, ఇతర వివరాల నవీకరణ కో సం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజ్యాం గం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధంలాంటిదని, ఎన్నికల ప్రక్రియలో ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. నేటి నుంచి బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారని తెలిపారు.
ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయాలి
నర్సాపూర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అభివృద్ధిపై ఆమె సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా అధికారులు పనిచేయాలన్నారు.వర్షాకాలం నేపథ్యంలో వరదల నివారణ కోసం చర్యలు చేపట్టాలన్నారు. వ్యర్థాల నిర్వహణ, పట్టణ పరిశుభ్రత, మొక్కలు నాట డం వంటి వాటిపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు.
పిల్లలకు పౌష్టికాహారం అందించాలి
అనంతరం అచ్చంపేటలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ మెనూ ప్రకా రం అంగన్వాడీ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, తక్కువ బరువు, ఎత్తు ఎక్కువ ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో ఆర్డీవో రామకృష్ణ,తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సాయికుమార్,మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, సర్పం చ్ తుల్చమ్మ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

