ధాన్యం కొనుగోళ్లు వేగిరం చేయాలి
రైతులకు ఇబ్బందులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగిరం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ మాధూరితో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
- రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దు
- సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశం
సంగారెడ్డి, మే 1: రైతులకు ఇబ్బందులు లేకుండా యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగిరం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్‌జైన్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో శుక్రవారం అదనపు కలెక్టర్ మాధూరితో కలిసి ధాన్యం కొనుగోళ్లపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ధానం కొనుగోలు కేంద్రాలు, ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, ట్యాబ్ ఎంట్రీలు, కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, గన్నీబ్యాగుల లభ్యత, తేమ కొలిచే యంత్రాలు, రైతుల ఖాతాల్లో జమ అయిన చెల్లింపుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్యాక్స్ డీసీఎంఎస్, ఐకేపీలతో జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 175 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అన్ని కొనుగోలు కేంద్రాలను తక్షణమే పూర్తిస్థాయిలో ప్రారంభించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సజావుగా ధాన్యం సేకరణ కొసాగించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

