నంగునూరు, సెప్టెంబర్ 4: అధిక వర్షాల కారణం గా ముంపునకు గురై రైతువేదికలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అన్నారు. అక్కెనపల్లిలో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలో ఆశ్ర యం పొందుతున్న 23 కుటుంబాలకు చెందిన 53 మంది వరద బాధితులను బుధవారం సీపీ అనురాధతో కలిసి కలెక్టర్ మను చౌదరి పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.
బాధితులకు శాశ్వత గృహాలు నిర్మించేందుకు ప్రజాపాలన కార్యక్ర మం ద్వారా స్వీకరించిన అర్జీలను పరిశీలిస్తామని తెలిపారు. వైద్యాధికారులను పంపి అందరికీ వైద్యపరీక్షలు చేపిస్తామని, ఆహారం, ఇతర అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేయాలని, బాధితుల పూర్తి వివరాలతో త్వరగా పూర్తి నివేదిక, ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ సరితను ఆదేశించారు. చెరువు బ్యాక్ వాటర్‌తో ఇండ్లు ఎఫెక్ట్ అవుతున్నందున చెరువులో వాటర్ తగ్గించే ఏర్పాటును పరిశీలించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.