సిద్దిపేట అర్బన్, ఆగస్టు 14: నాణ్యమైన వం ట పదార్థాలు వాడి విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సిద్దిపేట కలెక్ట ర్ మనుచౌదరి అధికారులకు సూచించారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం ఎ న్సాన్పల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
ఈ మే రకు పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నా యా..అని ఆరా తీశారు. పాఠశాల చుట్టూ ప్రహరీ లేక కుక్కలు, పందులు లోపలికి వస్తున్నాయని, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించాలని సిబ్బంది కలెక్టర్కు తెలిపారు. విద్యార్థుల కోసం వండిన వంటను కలెక్టర్ పరిశీలించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యాలకు గురైనా తన దృష్టికి తీసుకురావాలన్నారు.
ప్రతి ఒక్క రూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఆ లక్ష్యాలను చేరుకునే విధంగా విద్యాభ్యాసం కొనసాగించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు ఆగిన చోట ఇంకుడు గుంత ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మనుచౌదరి వెంట పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు.