నర్సాపూర్, జూలై 9 : బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో భాగంగా పూరి, ఇడ్లీ, ఉప్మా పెట్టేవారు. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాధరావు కాలనీలోని ప్రభుత్వ పాఠశాల, రోష్నీ ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు శివంపేట్ మండలం చిన్నగొట్టిముక్కల ఉన్నత, ప్రైమరీ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేశారు. విద్యార్థులు ఉదయం ఇంటినుంచి వచ్చి పాఠశాలల్లో పెట్టే అల్పాహారం తిని చక్కగా చదువుకునేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు అల్పాహారం పథకాన్ని రద్దుచేయడంతో విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. పునఃప్రారంభించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఉదయం ఏమి తినకుం డా ఇంటి నుంచి పాఠశాలకు వస్తే కండ్లు తిరిగి పడిపోతున్నాం. ఇంట్లో తిని వద్దామంటే సమ యం సరిపోవడం లేదు. గతంలో పాఠశాలలో టిఫిన్ పెట్టడం మంచిగా ఉండేది. ప్రస్తుతం టిఫిన్ పెట్టడం ఆపేశారు. ఉద యం ఏమి తినకపోవడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మళ్లీ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి.
గతంలో ఇంట్లో ఏమి తినకుండా పాఠశాలకు వచ్చినా పాఠశాలలో టిఫిన్ పెడతారనే భరోసా ఉండేది. ఇప్పు డు పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ ఆపివేయడంతో ఇబ్బందిగా ఉంది. గతంలో బ్రేక్ఫాస్ట్ పెట్టిన మాదిరిగా ఇప్పుడు కూడా పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.