దుబ్బాక, నవంబర్ 26: కత్తి ఒకరికిచ్చి మరొకరిని యుద్ధం చేయమంటే చేస్తాడా.. అందుకోసమే ప్రభాకర్‌రెడ్డిని గెలవాలి. దుబ్బాకలో ఎవరికో ఓటేస్తే అభివృద్ధి కాదని, బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
* ధరణి పోర్టల్‌పై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇది చాలా డేంజర్ మాట.. గడబెడ బంజెయ్యాలే.. అంటూ కాంగ్రెసోళ్లకు తమాషా.. ఇది మనకేమో జీవన్మరణ సమస్య. రైతుల భూముల బాధలు నాకు తెలుసు. నేను కూడా కాపోన్నే. ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నా. మూడు సంవత్సరాలు తండ్లాడి, ధరణి పోర్టల్ తీసుకొచ్చిన. గతంలో రైతులకు భూములపై పూర్తి హక్కులుండేవి కాదు. అప్పట్లో.. ఏ రాత్రైనా ఒకరి భూములు మరొకరి పేరిట మారిపోయేది.
ఎల్లయ్యది మల్లయ్యకు.. మల్లయ్యది పుల్లయ్యకు రాసేటోళ్లు. ఇపుడా ధరణి పోర్టల్‌తో రైతు బొటనవేలు లేకుండా ముఖ్యమంత్రి ఉన్నా మారది. అలాంటి ధరణి పోర్టల్ తీసేస్తే కైలాసం ఆటల పెద్దపాము మింగినట్టు అయితది. పారదర్శకంగా ఉన్న భూ వ్యవస్థ బంగాళాఖాతంలో వేసినట్లు అయితది. దీనిపై గ్రామాల్లో చర్చ పెట్టాలని సీఎం సూచించారు. దుబ్బాకలో ఎన్నడూ కత్తిపోట్లు చూడలేదు. దుబ్బాకలో నేను చదువుకున్న. అప్పటి నుంచి ఎప్పుడూ కత్తిపోట్ల రాజకీయం చూడలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటి సంస్కారం లేకుండే. కత్తులు వాళ్లవద్దనే ఉన్నాయా? మన వద్ద అంతకంటే పెద్ద కత్తులున్నాయ్.. మనకెంత కోపమొచ్చినా అణిచివేసుకున్నం. క్రమశిక్షణ గల పార్టీ మనది.
* దుబ్బాకలో రామలింగారెడ్డిగారు చనిపోతే బై ఎలక్షన్లు వచ్చినయి. ఆ ఎన్నికల ప్రచారానికి నేను రాలేదు. అప్పుడు వస్తే కథ ఒడిసిపోయేది. బీజేపీ నాయకుడు వాగ్ధానాలు ఎన్నో సెప్పిండు. ఒక్కటి కూడా చేయలేదు. ఇసోంటి మోసకారి గెలిచిండు. అని ఎద్దేవా చేశారు.
* మల్లన్నసాగర్ పుణ్యమా అని కూడవెల్లివాగు ఎండకాలంలో మత్తడి దుంకుతున్నది. ప్రాజెక్టుల నుంచి నదులకు నీళ్లు వదులతరా.. తెలంగాణ బాధ మనకు తెలుసు. పండేటోనికి తెలుసు గునివాటమని కాంగ్రెస్, బీజేపీలను ఉద్దేశించి అన్నారు.