ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ సోమవారం సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సంగారెడ్డి పట్టణంతోపాటు అన్ని మండలాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. సభలో కళాకారులు పాడిన పాటలు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజల్లో ఉత్తేజం నింపాయి.

సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్తో సభా ప్రాంగణాన్ని చుట్టేయగా.. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు జై తెలంగాణ, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలతో సభ మార్మోగింది. సీఎం కేసీఆర్ హెలిక్యాప్టర్ సరిగ్గా 4:52 గంటలకు ల్యాండ్ అయ్యింది. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి 4:58 గంటలకు చేరుకొని, 5.07 గంటలకు సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించి 5.50 గంటలకు ముగించారు.
