నారాయణఖేడ్, మే 25 : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సేవలను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో గురువారం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని స్థాయిల్లోని ఉద్యోగులతో సఖ్యత పాటిస్తూ వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందిస్తుందన్నారు. ఉద్యోగులు సైతం ఇదే స్ఫూర్తితో పని చేసి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు పర్చడంలోనూ, గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.