Unorganized workers | నర్సాపూర్ : అసంఘటిత కార్మికులు తమకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని శుక్రవారం ఛలో హైదరాబాద్ నిర్వహిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ధర్నాకు అనుమతులు ఇచ్చినట్లే ఇస్తూ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం సిగ్గుచేటని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు మండిపడ్డారు. ఇవాళ నర్సాపూర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అసంఘటిత కార్మికులు లేనిది ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడినుండి వస్తుందని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్న రవాణా రంగ కార్మికులు, హమాలీ కార్మికులకు ఎటువంటి సంక్షేమ బోర్డు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మూలంగా ఆటో కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని మండిపడ్డారు.
సంవత్సరానికి ఆటో కార్మికులకు రూ. 12 వేలు ఇస్తానని మోసం చేసిందని, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. హమాలీ కార్మికులు లేనిదే ప్రభుత్వ గోదాములు, అనేక సూపర్ మాల్స్, అనేక ఎగుమతులు, దిగుమతులు జరగవని అలాంటి కార్మికులకు అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేసిన ప్రభుత్వాలు పటించుకోవడం లేదని మండిపడ్డారు.
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళ్తున్న సీఐటీయూ నాయకులను, కార్మికులను అక్రమంగా అరెస్టులు చేయడం మూలంగా ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసంఘటిత రవాణా రంగం, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు