మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 11: మెదక్ చర్చి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు, పర్యాటకులు తరలిరావడంతో చర్చి ప్రాంగణమంతా భక్తులతో నిండిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి రెవరెండ్ జార్జి ఎబినేజర్ రాజు భక్తులనుద్దేశించి దైవ సందేశం చేశారు. ప్రార్థనల్లో పాస్టర్లు డేవిడ్, జైపాల్, సువర్ణ చర్చి కమిటీ సభ్యులు రోలండ్పాల్, వికాస్, సంశాన్ సందీప్, సునీల్, సువన్డగ్లస్ జాయ్ముర్రే తదితరులు పాల్గొన్నారు.