Farmers Protest | చిలిపిచెడ్, మే 19 : అధికారుల తీరు పట్ల చిట్కుల్ రైతులు నిరసన బాట పట్టారు. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం రైతులు వరి ధాన్యం తరలించడం లేదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ చిట్కుల్ గ్రామంలో ధాన్యం తరలించడంలో జాప్యం చేయడం, ధాన్యం బస్తాకు మూడు కిలోల తరుగు తీయడం పట్ల నిరసిస్తూ మెదక్-సంగారెడ్డి రహదారిపై రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. రైతులు రోడ్డు ఎక్కడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీస్ సిబ్బంది నర్సింహులు అక్కడికి చేరుకొని తహసీల్దార్,ఏపీఎంతో ఫోన్లో మాట్లాడి రైతులను సముదాయించారు.
ధాన్యాన్ని తరలించే వరకు రోడ్డుపై నుంచి జరిగేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ రైతులు రోడ్డుపై నినాదాలు చేశారు. తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడి ధాన్యం తరలించేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ నిరసనలో రైతులు తదితరలు పాల్గొన్నారు.
మొలక వచ్చిన ధాన్యం చూపుతున్న రైతు..
రైతు కొన్యాల రవి మొలక వచ్చిన ధాన్యాన్ని చూపుతూ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నాడు. వరి కోసి నెల అవుతుంది. సగం మంది రైతుల కుప్పలు కూడా అయిపోలేదు. కాంటా వేసిన ధాన్యాన్ని కూడా
పది రోజులుగా ఆపుతున్నరు. వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.
Street lights | పట్టపగలే వెలుగుతున్న వీధిలైట్లు.. పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
Collector Rahul Raj | ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలి.. వైద్య సిబ్బందితో కలెక్టర్ రాహుల్ రాజ్