Chit business | నర్సాపూర్, మే 17: చిట్టీ డబ్బులు కట్టలేదని ఓ చిట్టీ నిర్వాహకుడు ఇంటికి తాళం వేసిన సంఘటన నర్సాపూర్ మున్సిపల్ 10వ వార్డులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నర్సాపూర్ మున్సిపల్ 10వ వార్డుకు చెందిన శ్రీనివాస్ అనే చిన్న వ్యాపారవేత్త చిట్టీ నిర్వాహకుడైన అంతారం అశోక్‌గౌడ్ వద్ద చిట్టీ వేయడం జరిగింది.
చిట్టీ డబ్బులు కట్టడం లేదని అంతారం అశోక్‌గౌడ్ శుక్రవారం శ్రీనివాస్ ఇంటి గేటుకు తాళం వేయడం జరిగింది. ఈ సంఘటనపై కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం కుటుంబాన్ని రోడ్డున పడేయడం మంచి పద్దతి కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
నర్సాపూర్ పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాలలో చట్టవిరుద్దంగా చిట్టీల వ్యాపారాలు జోరుగా నడుస్తున్నాయని, వాటికి ఎలాంటి చట్టబద్దత లేదని.. వీటిపై అధికారులు దృష్టి పెట్టాలని పలువురు కోరారు.
Read Also :
Inmates Escaped: అమెరికా జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ
Karimnagar Simha Garjana | కరీంనగర్ సింహ గర్జన.. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం ఇదీ..
Tortoise | ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ఈది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాబేలు