సదాశివపేట, మే 30 : ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని రవీంద్రమోడల్ స్కూల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ఎమ్మె ల్యే ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెగా హెల్త్ క్యాంపులోఎలాంటి పరీక్షలు చేస్తారని ఆయన అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఉచిత మెగా హెల్త్ క్యాంపును పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలో నూతనంగా నిర్మించిన అధ్యా దవాఖానను నిర్వాహకులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. బీఆర్ఎస్ నాయకుడు శివరాజ్‌పాటిల్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, విద్యాసాగర్‌రెడ్డి, చింతా సాయినాథ్, చీల మల్లన్న, డాక్టర్ కిశోర్, ఇంద్రమోహన్‌గౌడ్, మైనార్టీ నాయకుడు అక్బర్, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.