Chilipiched | చిలిపిచెడ్, సెప్టెంబర్ 15 : చిలిపిచెడ్ గ్రామ చెరువుకు ముప్పు ఉందని తహసీల్దార్ సహదేవకు గ్రామానికి చెందిన మత్స్యశాఖ సంఘం సభ్యులు, రైతులు వినతి పత్రం అందజేశారు. చిలిపిచెడ్ రెవెన్యూ గ్రామమైన శిలంపల్లి గ్రామ చెరువుకు గ్రామస్తులు అలుగు వెళ్లకుండా మట్టి పోశారని తెలిపారు. ఆ చెరువు అలుగుకు నీరు బయటకు వెళ్లకుండా మట్టి వేయడంతో చిలిపిచెడ్ పెద్ద చెరువుకు ప్రమాదం జరుగుతదని తహసీల్దార్‌కు తెలియజేశారు.
శిలంపల్లి చెరువు అలుగు పోకుండా మట్టి పోసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ చెరువు, కుంటల ఇరిగేషన్ మండల ఏఈ హరీష్ రెడ్డికి ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ చెరువును పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిలిపిచెడ్ గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.
Bhoodan Pochampally : పింఛన్లు పెంచాలని భూదాన్ పోచంపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
man shot wife dead | మరో వ్యక్తి బర్త్ డే పార్టీలో భార్య.. వీడియో చూసి కాల్చి చంపిన భర్త
SIR | ‘సర్’ చెల్లుబాటుపై అక్టోబర్ 7న తుది వాదనలు వింటాం : సుప్రీంకోర్టు