సిద్దిపేట, జూన్ 12: పిల్లలు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఇటీవల నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటిన్ ఉచిత సమ్మర్ క్యాంపు శిబిరంలో శిక్షణ పొందిన 70 మంది క్రీడాకారులకు గురువారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో సర్టిఫికెట్లు, మెడల్స్‌ను ఆయన ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో అన్నింట్లో రాణిస్తే కెరీర్ ఉజ్వలంగా ఉంటుందన్నారు.
చిన్నప్పటి నుంచే క్రీడలు, చదువు, యోగా లాంటివి అలవర్చుకోవాలన్నారు. సిద్దిపేట క్రీడా హబ్‌గా ఎదిగిందని, ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసిందన్నారు. అత్యాధునిక హంగులతో కోటి 25 లక్షలతో బ్యాడ్మింటన్, బాసెట్బాల్ క్రీడాప్రాంగణాన్ని అభివృద్ధి చేసుకున్నామని, క్రీడల్లో మరింత రా ణించాలని పిలుపునిచ్చారు. అనంతరం కాసేపు వారితో ఆత్మీయం గా ముచ్చటించారు.