Chamendeshwari Temple | చిలిపిచెడ్, సెప్టెంబర్ 21 : మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులో మంజీర నది తీరాన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం ఎంతో విశిష్టత కలిగిన దేవాలయం. మంజీరా నది గల గలలు, ఇసుక తిన్నెల చుట్టూ పచ్చని చెట్లు, ఎంతో ప్రశాంత వాతావరణం, నిత్యం ధూప దీప నైవేద్యాలు, భక్తుల కుంకుమార్చనలు, ఒడిబియ్యాలతో ప్రత్యేక పర్వదినాల్లో విశిష్టమైన పూజాది కార్యక్రమాలు కులమత బేధాలు పట్టింపులేని ఆధ్యాత్మిక శోభాయామానం, అదే శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయ ప్రత్యేకత.
రేపటి సోమవారం 22 తేదీ దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ ఒకటో తేదీ బుధవారం ముగింపు జరుగుతాయని ఆలయ ప్రత్యేక పూజలు ప్రభాకర్ శర్మ తెలిపారు. ఈ ఆలయంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజులు శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి మాత, ఒకే అవతారంలో నవరాత్రుల్లో పూజలందుకోవడం అమ్మవారి ప్రత్యేకత. అమ్మవారికి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జపములు, పారాయణములు నిర్వహిస్తామన్నారు.
సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8:00 వరకు అమ్మవారికి మహా పూజ, మహా నివేదన, హారతి, తీర్థ ప్రసాదం వినియోగము వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. దేవి ఉత్సవాలు ప్రారంభం రోజు అమ్మవారికి అభిషేకంలో భక్తుల పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ పూజారి ప్రభాకర్ శర్మ, ఆలయ సభ్యుడు శోభన్ బాబు తెలిపారు.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత
Tandur | ఇరువైపులా తుమ్మ చెట్లు – ప్రమాదాలకు గురువుతున్న వాహనాదారులు