సిద్దిపేట, జనవరి 4: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆలోచనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సర్పంచ్లు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య అన్నారు. దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట ఎంపీడీవో కార్యాలయంలో సిద్దిపేట జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సర్పంచులు, ఉప సర్పంచులకు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. సర్పంచ్లు పార్టీలకతీతంగా వ్యవహరిస్తూ, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. పదవిని సద్వినియోగం చేసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.శంకర్, ప్రతినిధులు మెట్ల శంకర్, ఎగొండ స్వామి, భీమ్ ధేఖర్ పొతరాజు శంకర్, తిరుపతి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవీ రవీందర్, తిమ్మాపూర్ సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ ,బ్యాగరి వేణు, సుల్తానా, పుట్ట రాజు, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.