జగదేవ్‌పూర్, ఏప్రిల్ 16: అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా అపూర్వ ఆదరణ వస్తున్నదని, రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా సమన్వయకర్త బోడెకుంట్ల వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం జగదేశ్పూర్ మండల కేంద్రంలోని కేశిరెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేసీఆర్ ఆత్మీయ సందేశం వినిపించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈడీ, ఐటీ దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తుందని విమర్శించారు. తెలంగాణ రాకముందు ప్రజలు అనేక కష్టాలు పడ్డారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ముందు చూపుతో అనేక ప్రాజెక్టులు కట్టించారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేయించారన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో పచ్చని పంట పొలాలు, పాడి పశువులు, గోదావరి జలసిరులతో అలరారుతుందన్నారు. గత ప్రభుత్వాలు 70 ఏండ్లలో చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసి చూపించారన్నారు. కలలో కూడా ఊహించని విధంగా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.
దేశ వ్యాప్తంగా ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.14 ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని దేశం గర్వించే విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో ప్రతిపక్షాల గుండెల్లో వణుకు పుట్టిందన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్ని వనరులు ఉన్నా కోట్లాది మంది ఇబ్బందులు పడుతున్నారని భావించిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. ఇతర రాష్ర్టాల్లో బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య ఆదరణ వస్తుందని, దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ నాగిరెడ్డి, కేశిరెడ్డి నర్సింహారెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ బాలేశంగౌడ్, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ దేవాలయం చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్, సర్పంచులు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు నరేశ్, కావ్యాదుర్గయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు కనకయ్య, అయిలయ్య, యాదగిరి, దయానందరెడ్డి, చంద్రశేఖర్, సత్యం, లావణ్యామల్లేశం, దుర్గారెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకికార్యకర్తలే బలగం
బీఆర్ఎస్పార్టీకి కార్యకర్తలే బలగం.రాష్ట్రంలో 60లక్షల సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో కార్యకర్తలదే కీలక పాత్ర. ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత గౌరవం ఉంటుంది. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టాలి. తప్పుడు ప్రచారాలను యువకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా అడ్డుకోవాలి. సీఎం కేసీఆర్. మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఎక్కడా లేని అభివృద్ధి జరిగింది.
– ఎఫ్డీసీ చైర్మన్వంటేరు ప్రతాప్‌రెడ్డి
దేశ్‌కీ నేత సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి పనులు యావత్ ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలిగాయి. 24 గంటల విద్యుత్, రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతో సీఎం కేసీఆర్ జాతీయ నేతగా గుర్తింపుపొందారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు ఆయన్ను దేశ్కీనేతగా చూడాలనుకుంటున్నారు.
– ఎమ్మెల్సీ యాదవరెడ్డి
విస్తృతంగా ప్రచారం చేయాలి
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్ గల్లంతు కావడం ఖాయం. దేశం గర్వించే విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండి భరోసా కల్పించాలి. ప్రతిపక్షాల దుష్ర్పచారం తిప్పికొట్ట్టాలి. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలి.
-ఆత్మ కమిటీ చైర్మన్ గుండారంగారెడ్డి
గడపగడపకూ సంక్షేమ పథకాలు
తెలంగాణలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు, అభివృద్ధి జరగని పల్లె లేదు. పార్టీలకతీతంగా పథకాల అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యంగా పాలన కొనసాగుతుంది. రైతుబంధు, రైతు బీమా, కాళేశ్వరం జలాలు, ఇంటింటికీ భగీరథ తాగునీరు, 24 గంటల విద్యుత్ వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
– రోజాశర్మ, జడ్పీ చైర్పర్సన్
యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి
బీఆర్ఎస్లో యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. పేదల కోసం షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు అమలు చేయడం సంతోషకరం. మహిళలకు సరైన ప్రాధాన్యం కల్పించినైట్లెతే మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తారు.
– కవిత, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు, జగదేవ్‌పూర్ ఎంపీటీసీ