‘సుహాస్‌ని దృష్టిలో పెట్టుకొని రాసిన కథ ఇది. ‘అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్’తో సుహాస్, శివానీ హిట్ పెయిర్‌గా నిలిచారు. అందుకే ఈ సినిమాక్కూడా శివానీనే తీసుకున్నాం. ఆద్యంతం కామెడీగా సాగే ఈ సినిమాలో తండ్రీకొడుకుల ఎమోషన్స్ కూడా ఉంటాయి. అందర్నీ ఆకట్టుకునే సినిమా ఇది.’ అని గోపీ అచ్చర అన్నారు. ఆయన దర్శకత్వంలో సుహాస్, శివానీ నాగరం, సీనియర్ నరేష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన కామెడీ ఎంటర్టైనర్ ‘హే భగవాన్’. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గోపీ అచ్చర బుధవారం విలేకరులతో ముచ్చటించారు. మన జీవితంలో ‘హే భగవాన్’ అనుకునే సందర్భాలు చాలానే ఉంటాయి. ఈ సినిమాలోని పాత్రలకు కూడా అలాంటి సంఘటనలు ఎదురవుతాయి. అవేంటి? అనేది తెరపైనే చూడాలి. సుహాస్ కెరీర్లోనే భిన్నమైన పాత్రను ఇందులో చేశాడు. నరేష్, వెన్నెలకిశోర్, హర్షవర్దన్, అజయ్‌ఘోష్ ఇలా అన్ని పాత్రలూ అలరిస్తాయి. సాంకేతికంగా కూడా సినిమా అందరికీ నచ్చుతుంది.’ అని తెలిపారు దర్శకుడు గోపీ అచ్చర.