హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్సపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఆయన అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసిన వెంటనే ఆందోళన చెందారు. పార్టీ ముఖ్యనేతలతో ఫోన్లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడూ సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. వారికి సూచన లిస్తూ అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌లో అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. అలాగే కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని, పార్టీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. హరీశ్‌రావు, వినోద్‌కుమార్‌తో మాట్లాడి అప్రమత్తం చేశారు. దగ్గరుండి చికిత్సను పర్యవేక్షించాలని సూచించారు. కాగా, పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య సమాచారాన్ని.. ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేస్తున్న కృషిని వివరిస్తున్నారు.