హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ) : పురపోరులో అధికార పార్టీ మూకలు దౌర్జన్యానికి తెగబడ్డాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా జరుగాల్సిన మున్సిపల్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సృష్టించిన అరాచకాలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దొంగ ఓట్లు, నగదు పంపిణీ, దాడులు, లాఠీచార్జ్‌లతో పలు జిల్లాలోని పోలింగ్ కేంద్రాలు రణరంగంగా మారాయి. అధికార అండతో కొందరు పోలీసులు, కాంగ్రెస్ శక్తులు అడ్డూఅదుపు లేకుండా వ్యవహరించాయి. యథేచ్ఛగా, బహిరంగంగానే డబ్బు లు పంచి ఓటర్లను ప్రలోభపెట్టాయి. ఇంత జరుగుతున్నా పోలీసు యంత్రాంగం వారికే వత్తాసు పలికిందంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. పోలింగ్ సందర్భంగా టీపీసీసీ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రెచ్చిపోయి పోలీసులు, అధికారులను తిట్టి, బెదిరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. చివరకు ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని ఆయనపై కేసు నమోదు చేయాలని ఎస్పీని ఆదేశించింది.
పోలింగ్ రోజున హస్తం నేతలు, అభ్యర్థులు ఎన్ని అరాచకాలు సృష్టించారో చెప్పేందుకు జగ్గారెడ్డి ఘటనే నిదర్శనం అని విపక్షాలు భగ్గుమంటున్నాయి. మెదక్ జిల్లా సంగారెడ్డిలో 34వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద హైడ్రామా నడిచింది. టీపీసీసీ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఏకంగా పోలింగ్ బూత్‌లోకి దూసుకెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలింగ్ ఆపేస్తానంటూ ఆయన చేసిన బెదిరింపులు, అకడి అధికారులు, పోలీసులపై ఆయన వాడిన భాష తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన మీడియాలో ప్రముఖంగా రావడంతో జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఎస్ఈసీ ఆదేశించింది. అటు నర్సాపూర్‌లోనూ 15వ వార్డులో బీఆర్ఎస్ నాయకులపై బీజేపీ శ్రేణులు దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి జనాన్ని చెదరగొట్టాల్సి వచ్చింది.
నల్లగొండలో కాంగ్రెస్ హల్చల్
నల్లగొండ జిల్లాలో అధికార పార్టీ నేతలు బరితెగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. నల్లగొండ 32వ డివిజన్లో దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలనే పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. 30వ డివిజన్ పోలింగ్ బూత్‌లో దొంగ ఓట్లు కలకలం రేపాయి. అడ్డుకొన్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగారు. చిట్యాల మున్సిపాలిటీలో ‘కాంగ్రెస్ వాళ్లు 4వేలు ఇస్తే, మీరు 5 వేలు ఇచ్చుకోండి’ అని ఓ ఎస్సై బహిరంగంగానే వ్యాఖ్యానించడం పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దేవరకొండ ము న్సిపాలిటీ 16వ వార్డులో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యానికి దిగాయి.
కామారెడ్డిలో ఎమ్మెల్యేల ప్రత్యక్ష జోక్యం
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్మోహన్రావు స్వయంగా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లను ప్రలోభపెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. బాన్సువాడలో ఏకంగా ఒక కానిస్టేబుల్ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రచారం చేయడం గమనార్హం. నిజామాబాద్ 19వ డివిజన్లో బీజేపీ-కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ జరిగింది.
హుజూరాబాద్‌లో ఆన్లైన్లో బ్యాలెట్ పేపర్
కరీంనగర్లో జిల్లా హూజూరాబాద్ మున్సిపాలిటీ 2వ వార్డులో ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ సెల్‌ఫోన్ పోలింగ్ స్టేషన్లోకి ఎలా వెళ్లిందనేది చర్చనీయాంశమైంది.
మంచిర్యాలలో దర్జాగా నగదు పంపిణీ
మంచిర్యాల (చెన్నూరు)లో మంత్రి వివేక్ బైక్‌పై తిరుగుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ అంబేదర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పెద్దింటి పద్మ భర్త శ్రీనివాస్ ఓటర్లకు డబ్బులు పంచగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశా రు. దీంతో ఆ వార్డు ఎన్నిక రద్దు చేయాలని బీఆర్ఎస్ సహా స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు పోలింగ్ కేంద్రం ఎదుట ధర్నా చేశారు.
కరీంనగర్లో లాఠీచార్జ్
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో బుధవారం స్వల్ప లాఠీచార్జ్ జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ 58వ డివిజన్లోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు ఓ మహిళ ఓటు వేయడానికి రాగా, ఆమె ఓటు అప్పటికే వినియోగించినట్టు ఉన్నదని పోలింగ్ సిబ్బంది తెలిపారు. దీంతో ఆ మహిళ బయటకు వచ్చి చెప్పుకోగా, అక్కడే ఉన్న బీజేపీ నాయకులు కొందరు లొల్లిచేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం కాస్త గొడవకు దారితీసింది. విషయం తెలుసుకున్న సీపీ గౌస్ ఆలం అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేయించారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు రోడ్లపై పరుగులు తీశారు. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ సందర్భంగా 58వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
కరీంనగర్లో ఎమ్మెల్యే గంగులపై కేసు
కరీంనగర్‌లోని 28వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థితోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్టు తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వెళ్లి ఆందోళనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ నాయ కులను పోలీసులు బలవంతంగా తమ వాహ నం ఎక్కించారు. విషయం తెలుసుకున్న ఎ మ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడికి వెళ్లి పోలీ సులపై మండిపడ్డారు. ఓ కార్యకర్తను పోలీస్ వాహనం నుంచి దింపినందుకు ఎమ్మెల్యే గంగుల, బీఆర్ఎస్ అభ్యర్థి కుర్ర తిరుపతితో పా టు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
అరాచక ఘటనలు..
మంచిర్యాలలో దర్జాగా నగదు పంపిణీ
మంచిర్యాల (చెన్నూరు)లో మంత్రి వివేక్ బైక్‌పై తిరుగుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ అంబేదర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ 2వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పెద్దింటి పద్మ భర్త శ్రీనివాస్ ఓటర్లకు డబ్బులు పంచగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వార్డు ఎన్నిక రద్దు చేయాలని బీఆర్ఎస్ సహా స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారులు పోలింగ్ కేంద్రం ఎదుట ధర్నా చేశారు. అధికార బలంతో కాంగ్రెస్ శ్రేణులు చేసిన ఆగడాలు, పోలీసుల అత్యుత్సాహం ప్రజాస్వామ్య స్ఫూర్తిని కించపరిచేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నకిలీ ఓటర్లను అడ్డుకున్నందుకు అరెస్ట్
నల్లగొండ 32వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు వేరే ప్రాంత వ్యక్తులతో నకిలీ ఓట్లు వేయిస్తుండగా అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసినందుకు నిరసన తెలుపుతూ నల్లగొండ ప్రగతి స్కూల్ వద్ద రాస్తారోకో చేసున్న మాజీ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి, నాయకులు
