Jantar Mantar : నీట్ పేపర్ లీకేజీపై జవాబుదారీ కోసం జంతర్ మంతర్ (Jantar Mantar) కేంద్రంగా సాగుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ(CJP), విద్యార్థుల పోరాటానికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు మద్ధతు తెలపడంతో అట్టుడుకుతోంది జంతర్ మంతర్. గురువారం కూడా నిరసనలు గట్టిగానే కొనసాగగా.. ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భద్రతా పరమైన చర్యల్లో భాగంగా జంతర్ మంతర్ ప్రాంతంలో మొబైల్, ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు.
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను భర్తరఫ్ చేయాలని జంతర్ మంతర్ కేంద్రంగా కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమం కేంద్రానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత రెండు రోజులుగా అన్ని దారులు జంతర్ మంతర్ వైపే అన్నట్టుగా.. మద్దతుదారులతో ఆ ప్రాంతం నిండిపోయింది. దాంతో, భద్రతా చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 23, గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ నుంచి ఒటిన్నర (1.5 కి.మీ) కిలోమీటర్ల వరకూ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. అర్ధ రాత్రి 12 గంటల వరకు ఆ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
Mobile internet services suspended in 1.5 km radius of Jantar Mantar from 4 pm to 12 midnight: MHA. pic.twitter.com/FmjoSCzmHr
— Press Trust of India (@PTI_News) July 23, 2026
జూలై 21న కేజీపీ నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ సందర్భంగా నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులపై దాడిని ఖండిస్తూ బుధవారం రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు బైఠాయించగా.. మూడు గంటల తర్వాత రాహుల్ సహా కీలక నేతల అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గురువారం ఉదయం నుంచి కూడా జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనలు కొనసాగగా.. సామాజికవేత్తలతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు ఈ ఉద్యమానికి మద్ధతు తెలిపారు.
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, “Our students are on the road, so all the opposition MPs felt that we should also be on the road. All the opposition MPs wanted to go to India Gate. They refused, stopped us. Then we said that we want to go Tees… https://t.co/vGLwepVQnq pic.twitter.com/beUkWVWwxg
— ANI (@ANI) July 23, 2026
‘విద్యార్థులు ఒంటరి కాదు.. విపక్షం అండగా ఉంది’ అనే నినాదంతో రాహుల్ గాంధీ, ఇండియా బృందం రాత్రి 8 గంటలకు బస్సులో గాంధీ స్మృతివనానికి బయల్దేరింది. దారిలో పోలీసులు భారీ కేడ్లతో అడ్డుకోవాలని చూసినా వెనకాడకుండా.. అక్కడకు చేరుకుంది. అనంతరం నీట్ పేపర్ లీకేజీతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు రాహుల్, ఇండియా కూటమి నేతలు.