Asian Games : ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ (India, Pakistan) జట్ల మధ్య పసిడిపోరు జరుగుతున్నది. టాస్ (Toss) గెలిచిన భారత్ బ్యాటింగ్ (India Batting) ఎంచుకున్నది. దాయాది పాకిస్థాన్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు కావడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. అయితే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉందని జపాన్ వాతావరణ కేంద్రం వెల్లడించడంతో పూర్తి మ్యాచ్ కొనసాగుతుందా లేదంటే రద్దవుతుందా..? అనేది అనుమానంగా ఉన్నది.
జపాన్‌లోని నిశిన్ వేదికగా కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. భారత జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, పాకిస్తాన్ జట్టుకు సాహిబ్జాదా ఫర్హాన్ నాయకత్వం వహిస్తున్నారు.
భారత్ (IND) : అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
పాకిస్తాన్ (PAK) : సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), అయూబ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), హైదర్ అలీ, హసన్ నవాజ్, అబ్దుల్ సమద్, అరాఫత్ మిన్హాస్, మొహమ్మద్ వసీమ్ జూనియర్, అబ్రార్ అహ్మద్, సుఫ్యాన్ ముకీమ్, అలీ రజా.