శంకరపట్నం/తిప్పర్తి, ఫిబ్రవరి 11: అసలే యూరియా కొరతతో సతమతమవుతున్న తమకు మొబైల్ యాప్ లింకు పెట్టడాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్, నల్లగొండ జిల్లా తిప్పర్తిలో బుధవారం ఆందోళనకు దిగారు. నిరక్షరాస్యులు, స్మార్ట్ ఫోన్ లేని రైతులకు యూరియా బుక్ చేసుకోలేని పరిస్థితులు ఉండటం, ఫోన్ ఉన్న రైతులు ఎన్నిసార్లు ప్రయత్నించినా యాప్ పనిచేయకపోవడం,
తరచూ సర్వర్ డౌన్, స్ట్రకప్ వంటి స మస్యలు వస్తుండటంతో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్‌లోని సహకార సంఘం గో దాం ఎదు ట రైతులు నిరసన తెలిపారు. సరిపడా యూరియా ఇవ్వాలని రైతులు అడిగితే మొబైల్ యాప్ తెచ్చి ఇబ్బందులు పెట్ట డం సరికాదని మండిపడ్డారు. చిన్న ఫోన్ల తో మొబైల్ యాప్ ఎలా వాడాలని ప్ర శ్నించారు.
మొబైల్ అప్లికేషన్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, గతంలో మాదిరిగా ఏరియా వారీగా యూరియా బస్తాలను సింగిల్‌విండో సొసైటీలు, ఎరువుల దుకాణాల ద్వారా నేరుగా విక్రయించాలని డి మాండ్ చేశారు. అనంతరం రోడ్డుపైకి వచ్చి తమ వద్ద ఉన్న మాన్యువల్ ఫో న్లను రోడ్డుపై పెట్టి ధర్నా చేశారు. కాగా యూరియా వస్తున్నదన్న సమాచారంతో రైతులు నల్లగొండ జిల్లా తిప్పర్తిలోని పీఏసీఎస్‌కు పెద్ద సంఖ్యలో వచ్చారు. యాప్ ఓపెన్ చేసిన 35 సెకండ్లలోపే బస్తాలు కనిపించకపోవడంతో రైతులు ఆగ్రహం తో తిప్పర్తిలోని అద్దంకి-నార్కట్‌పల్లి బై పాస్ రోడ్డుపై బైఠాయించారు. వాహనా లు భారీగా నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరి యా సమాచారం తెలిసి యాప్ ఓపెన్ చేసేలోపు అయిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. యాప్ ద్వారా యూరియా ఎట్లా బుక్ చేసుకోవాలో తెలియక అవస్థ పడుతున్నామని తెలిపారు. పోలీసులు, తహసీల్దార్ రామకృష్ణ, అధికారులు అక్కడికి వచ్చి సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళ విరమించారు.