Harassment Case | శివ్వంపేట, ఏప్రిల్ 9 : వివాహితపై వేధింపులకు పాల్పడిన భర్త, అత్తలపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కొంతాన్‌పల్లి గ్రామానికి చెందిన చెల్లి ప్రవీణ్‌కుమార్‌కు వెల్దుర్తి మండలం మన్నెవారిజలాల్పూర్కు చెందిన వినోదతో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
అయితే గత కొన్నేళ్లుగా భర్త ప్రవీణ్‌కుమార్, అత్త సత్యమ్మలు అదనపు కట్నం కోసం వేధించగా అప్పట్లో గుళికల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడి.. ప్రాణాలతో బయటపడింది. పెద్దల సమక్షంలో మాట్లాడినా ఫలితం లేదు. ఇటీవల గత మార్చి 31న రాత్రి భర్త, అత్తల వేధింపులకు గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ వినోద మంగళవారం మృతిచెందింది. భర్త, అత్త వేధింపుల వల్లే తన కూతురు మృతి చెందిందని మృతురాలు వినోద తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
BRS | ఇది పెండ్లి పత్రిక కాదు..! బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఆహ్వాన పత్రిక..!!
MLA Kadiyam Srihari | ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
TG Weather | తెలంగాణలో మరో మూడురోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ